ప్రోటీన్ ఎక్కువైనా.. సమస్యలే!

1
- Advertisement -

మన శరీర పెరుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ అనేది కండరాలను బలపరచడంలోనూ, ఎముకలను దృఢంగా మార్చడంలోనూ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే నేటి రోజుల్లో చాలామంది ప్రోటీన్ లోపంతో బాధ పడుతున్నారు. దానికి ప్రధాన కారణం పోషకాలు లేని ఆహారాన్ని తినడమే. సరైన పోషకాలు అందకపోవడం వల్ల శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుంది. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే చాలామంది తమలోని ప్రోటీన్ లోపాన్ని గుర్తించలేక ఏదేదో మెడిసిన్ తీసుకుంటూ లేని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు.

అయితే ప్రోటీన్ లోపంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అని తెలుస్తోండగా ఒకవేళ ప్రోటీన్ ఎక్కువైనా ఇబ్బందులు తప్పవు. ప్రోటీన్ ఎక్కువ అయితే మలబద్దక సమస్య వస్తుంది.

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. అలాగే హైపర్ టెన్షన్ కి దారితీస్తుంది. ఎన్ఐహెచ్ నివేదిక ప్రకారం 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు వారిలో ప్రోటీన్ అధికంగా ఉంటే ప్రాణాంతక వ్యాధులు వెంటాడుతున్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి డాక్టర్ల సూచన మేరకు ప్రోటీన్ ఉండే ఫుడ్‌ని తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:మైనారిటీలకు తీవ్ర నిరాశే..!

- Advertisement -