అమల కీ రోల్‌లో వెబ్ సిరీస్.. ‘హై ప్రిస్ట్స్’

393
High priestess webseries

అక్కినేని వారి కోడలు ప్రముఖ నటి అక్కినేని అమల చాలా రోజులు తరువాత మరో సారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. జీ 5 ఆప్ వారు నిర్మించిన వెబ్ సిరీస్ హై ప్రిస్ట్స్ లో అమల ముఖ్య పాత్ర పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్సెరీస్ ఏప్రిల్ 25 నుంచి జీ 5 ఆప్ లో ఆన్లైన్ అవుతుంది. టారో రీడింగ్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ని పుష్ప డైరెక్ట్ చేశారు.

ఈ వెబ్ సిరీస్ లో అమల తో పాటు ప్రముఖు నటుడు బ్రహ్మాజీ, వరలక్ష్మి శరత్ కుమార్, సునైనా, బిగ్ బాస్ 2 ఫేమ్ నందిత తదితరులు నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఈ వెబ్సెరీస్ కి వర్క్ చేసారు. గతం లో ఎన్నో విజయవంతమైన వెబ్ సిరీస్లను అందించిన నేపథ్యంలో మరోసారి మరింతగా ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయతనంలో అక్కినేని అమల గారితో ఈ హై ప్రిస్ట్స్ అనే సిరీస్ ని నిర్మించామని జీ 5 ఆప్ బృందం తెలిపింది.

ఈ సందర్భంగా అక్కినేని అమల మాట్లాడుతూ డైరెక్టర్ పుష్ప చెప్పిన లైన్ నచ్చడం తో హై ప్రైస్ట్స్ స్కిప్ట్ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఒప్పుకున్నానని తెలిపారు. నాకు బాగా ఆసక్తిగా అనిపించే టారో రీడింగ్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్‌ కథ ఉండటం నాకు బాగా నచ్చింది, ప్రేక్షకులకి కూడా నచ్చుతుంది అని తెలిపింది. ఏప్రిల్ 25న జీ 5 ఆప్ లో హై ప్రిస్ట్స్, వెబ్ సిరీస్ ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతుంది. అక్కినేని ఫాన్స్ తో పాటు, మిగిలిన అభిమానులని కూడా ఈ వెబ్ సిరీస్ తప్పక ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను అని తెలిపారు అమల.