కాచిగూడ రైలు ప్రమాదంపై హైలెవల్ కమిటీ

278
kachiguda

కాచిగూడ రైలు ప్రమాదంపై ముగ్గురు సభ్యులతో కూడిన హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసిం సౌత్ సెంట్రల్ రైల్వే. కాచిగూడ ప్రమాదస్ధలిని రేపు హైలెవల్ కమిటీ పరిశీలించనుంది.

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారమ్‌పై నిలిపి ఉంచిన కర్నూల్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీస్ ట్రైన్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీనంతటికీ సాంకేతిక లోపాలే కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకోపైలట్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు ప్రయాణీకులు సైతం గాయాలపాలయ్యారు. ఇంకా 10 మంది వరకు ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన లోకోపైలట్ పరిస్ధితి విషమంగా ఉంది.