పురుషోత్తముడుపై రాజ్ తరుణ్ భారీ ఆశలు

21
- Advertisement -

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు “పురుషోత్తముడు” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా

కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ – “పురుషోత్తముడు” సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. చాలా మంచి రోల్. మా డైరెక్టర్ రామ్ భీమన నాకు కొడుకు లాంటి వాడు. మా అబ్బాయి కూడా డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. రామ్ భీమనకు మన పురాణాలు, ఇతిహాసల గురించి బాగా తెలుసు. ఆ నేపథ్యంలో అందమైన పాత్రలు, డైలాగ్స్ రాశారు. ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ, మురళీ శర్మ.. మేమంతా సంతోషంగా చేసిన సినిమా ఇది. మా ప్రొడ్యూసర్స్ డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ తమ భుజాల మీద వేసుకుని ఈ సినిమాను చేశారు. “పురుషోత్తముడు” సినిమా మంచి సక్సెస్ కావాలి. ఈ నిర్మాతలు మళ్లీ మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ – పురుషోత్తముడు సినిమాలో నటించడాన్ని మేమంతా ఎంజాయ్ చేశాం. మా ప్రొడ్యూసర్స్ డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ఎప్పుడూ సెట్ లోనే ఉండేవారు. సినిమా మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. మొదటి సినిమాకే డైరెక్షన్ చేసేంత తెలుసుకున్నారు. మా డైరెక్టర్ రామ్ భీమన ముందు నుంచీ తెలుసు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం గారు ఇలా మంచి ప్యాడింగ్ మూవీలో ఉంది. రాజ్ తరుణ్ ఈ ఫంక్షన్ కు రాలేకపోయాడు. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతాడు. మా మీడియా మిత్రులంతా పురషోత్తముడు సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ – ఈ ఫంక్షన్ లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ గురించి. చాలా మంచి సాంగ్స్ ఈ మూవీకి ఆయన ఇచ్చారు. అలాగే డైరెక్టర్ రామ్ భీమనకు ఇది మూడో సినిమా. ఈ థర్డ్ మూవీ ఆయనకు బిగ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

కొరియోగ్రాఫర్ సుభాష్ మాట్లాడుతూ – పాటలకు కొరియోగ్రాఫ్ చేయడం అంటే కేవలం డ్యాన్సులు కాదు. ఆ కథను మరింత ముందుకు తీసుకెళ్లేలా చేయడం. అలాంటి అవకాశం నాకు ఇచ్చిన దర్శకుడు రామ్ భీమనకు థ్యాంక్స్. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కు నేనే కొరియోగ్రాఫ్ చేయడం సంతోషంగా ఉంది. అన్నారు.

Also Read:లండన్‌లో కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్

- Advertisement -