పెద్ద నోటు ఎఫెక్ట్‌: భర్త ఏటీఎంకు.. భార్య బ్యాంకుకు..

200
High currency ban effects on families
High currency ban effects on families
- Advertisement -

సాధారణంగా వీకెండ్‌ రోజు షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు రద్దీగా ఉండాలి. మోడీ పెద్ద నోట్లు రద్దు చేయడంతో బ్యాంకులు, ఏటీఎంలు రద్దీగా మారాయి. కార్తీక మాసం పెళ్లిల సీజన్‌తో పెళ్లి మండపాలు కళకళలాడాల్సింది. పెళ్లిండ్లకు రావాల్సిన బంధువులంతా పెద్ద నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చి పడింది. ప్రజలు నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలు వద్ద బారులు తీరారు. కొన్ని చోట్ల ఏటీఎంలు తెరుచుకోక పోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు శనివారం, ఆదివారాలు కూడా బ్యాంకులు పని చేస్తున్నాయి.

గురువారం, శక్రవారంతో పోలిస్తే శనివారం రోజు బ్యాంకుల వద్ద రద్దీ ఎక్కువగా కనిపిచింది. నెలలో రెండో శనివారం ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు వారాంతం కావటంతో ఉద్యోగస్థులు బ్యాంకులకు భారీగా తరలివచ్చారు. దీంతో రెండ్రోజులతో పోలిస్తే శనివారం రద్దీ ఎక్కువగా ఉన్నట్లు బ్యాంక్‌ అధికారులు వెల్లడించారు. పెద్ద నోట్లను మార్చుకునేందుకు వచ్చిన పలువురు తమ బాధను మీడియాతో పంచుకుంటున్నారు. ఒక గృహిణి తన ఇంట్లో డబ్బులేదని.. సెలవు ఉండడంతో ‘నేను ఒక బ్యాంక్‌కు వెళ్లాను, మా అమ్మాయి ఏటీఎం సెంటర్‌ దగ్గర, నా భర్త ఇంకో బ్యాంక్‌కి వెళ్లారు’ అని తెలిపింది.

ఒక ఐటీ ఉద్యోగి మాట్లాడుతూ ‘నాకు శనివారం సెలవు. నిన్న మొన్న మాములు ప్రజలు నగదు మార్చుకొని ఉంటారు. ఈ రోజు రద్దీ కొంచెం తక్కువగా ఉంటుందని భావించి బ్యాంకుకు వచ్చాను. కానీ నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉదయం 8:30 గంటలకే 30 మంది లైన్‌లో నిలబడి ఉన్నారు’ అని తన అనుభవాన్ని పంచుకున్నారు.

- Advertisement -