- Advertisement -
గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి వంశీపై కేసు నమోదైంది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ చేపట్టిన హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో పోలీసులు వంశీని కొద్దిరోజుల క్రితమే అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. వల్లభనేని వంశీకి ఈ ముందస్తు బెయిల్ నిరాకరణ భారీ ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.
Also Read:గుండెపోటుకు సంకేతాలివే..జాగ్రత్త పడండి!
- Advertisement -

