కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

16
- Advertisement -

విద్యుత్ కమిషన్ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని…జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.కేసీఆర్ పిటిష‌న్‌కు విచార‌ణ అర్హ‌త ఉందా లేదా అనే దానిపై వాద‌న‌లు ముగియగా ఇవాళ సాయంత్రం లేదా సోమ‌వారం తీర్పు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

ఏజీ వాదనలపై కేసీఆర్‌ న్యాయవాది ఆదిత్యా సోంధీ అభ్యంతర వ్యక్తం చేశారు. జ్యుడిషియల్‌ విచారణగా నివేదిక ఇవ్వాలే గానీ, మీడియాకు వివరాలు వెల్లడించకూడదు. విద్యుత్‌ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి కారకులెవరో తేల్చమన్నారు. ఇది సరికాదు అని ఆదిత్యా సోంధీ పేర్కొన్నారు.

జస్టిస్‌ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పిటిషన్‌ గురువారం హైకోర్టు ధర్మాసనం ముందు కు వచ్చింది. దాదాపు 45 నిమిషాలపాటు వాదప్రతివాదనలు జరిగాయి.

Also Read:కాల్షియం తగ్గిందా.. ఇవి తినండి!

- Advertisement -