ఆదివారం కూల్చివేతలా?:హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

12
- Advertisement -

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఆదివార రోజు కూల్చివేతలు ఎందుకు చేశారో చెప్పాలని ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అని ప్రశ్నించిన న్యాయస్థానం..పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా? అని అభిప్రాయపడింది.

హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పండి.. మీరు చట్టాన్ని ఉల్లగించి కూల్చివేతలు చేస్తున్నారు అని తెలిపిన న్యాయస్థానం..ఆదివారం కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియదా? అన్నారు.

రెండు రోజుల క్రితం హైడ్రా కూల్చివేతలపై విచారణ చేపట్టింది న్యాయస్థానం. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది హైకోర్టు. అమీన్‌పూర్‌లో ఇటీవల ఓ భవనాన్ని కూల్చేసింది హైడ్రా. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలని తెలపగా వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు రంగనాథ్‌.

Also Read:నేపాల్‌లో వరద బీభత్సం..

- Advertisement -