ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నోటిసు లిచ్చింది. ఇటివలే జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారంటూ నోటిసులు జారీ చేసింది కోర్టు. ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు తన ఆదాయం వివరాలను పొందు పరచలేదని ఇది చట్టానికి విరుద్దమని ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి తరపున ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించిన విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబుతో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా హైకోర్టు నోటిసులు జారీ చేసింది. వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్.మానవేంద్రరాయ్ .