- Advertisement -
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో అనంతపురం 4వ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బోరుగడ్డ అనిల్ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసులలో ఇప్పటికే రెండు కేసులలో ఛార్జ్‌షీట్ దాఖలైందని బీఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందని వివరించింది ప్రాసిక్యూషన్.
ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి…ఇలాంటి కేసులలో నిందితులను క్షమించడానికి వెళ్లేదిలేదంది కోర్టు.
Also Read:తెలంగాణ ప్రభుత్వానికి షాక్..
- Advertisement -