గీతం యూనివర్సిటీ రూ.118 కోట్ల విద్యుత్ బకాయిలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. సామాన్యులకు ఒక చట్టం, డబ్బు ఉన్న వాళ్లకు ఒక చట్టం రూపొందించారా అంటూ అసహనం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు.
హైదరాబాద్‌లోని గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం) యూనివర్సిటీకి ఉన్న రూ.118.13 కోట్ల పెండింగ్ విద్యుత్ బకాయిలపై, విద్యుత్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక.
తన చిన్నతనంలో రూ.800 బిల్లు చెల్లించకపోతే తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉంటుందా అంటూ హైకోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు.
విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా కాలయాపన చేస్తున్నారా, పదవుల్లో ఉన్న వారి పట్ల అధికారులు ఇలా వ్యవహరిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్వయంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలంటూ, ఈ నెల 22వ తేదీకి కేసును వాయిదా వేసింది హైకోర్టు.
Also Read:వాట్సాప్ డేటా సేకరణ..అనుమతి తప్పనిసరి!

