హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

13
- Advertisement -

హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా అని హెచ్చరించింది. మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను నిలదీసింది హైకోర్టు.

సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయొద్దు అని ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా? అని మండిపడింది. రాత్రికి రాత్రి హైదరాబాద్‌ను మార్చేద్దాం అని కలలు కంటున్నారా? చెప్పాలని ప్రశ్నించింది.

పత్రాలు పరిశీలించి భూయజమాన్య హక్కులు నిర్ణయించడానికి మీరెవరు?.. హైడ్రాకు ఉన్న అధికారాలు ఏంటో తెలుసా మీకు? అని ప్రశ్నించింది. పద్ధతి మార్చుకోకపోతే జీవో 99 రద్దు చేసి హైడ్రాను ముసేస్తాం జాగ్రత్తా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హెచ్చరించింది హైకోర్టు.

Also Read:హిమాలయాలకు వెళ్తున్నారా?: పవన్‌తో మోదీ

- Advertisement -