అధిక కోపంతో ఖచ్చితంగా గుండెకు ముప్పే!

6
- Advertisement -

హైబీపీ ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దీని కారణంగా గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంది. గుండె జబ్బులతో మరణిస్తున్న వారిలో అధిక శాతం హైబీపీ ఉన్న వారేనని అధ్యయనాలు చెబుతున్నాయి. మైకం కమ్మడం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె దడ వంటివి హైబీపీ లక్షణాలు.

అయితే హైబీపీ రావడానికి ప్రధాన కారణం మితిమీరిన కోపం. ఇది శరీరంపైనే కాదు మనస్సుపైన ప్రభావం చూపుతుంది. మితిమీరిన కోపం గుండె సంబంధిత సమస్యలకే కాదు అనారోగ్య పరిస్థితులకు దారితీసుందని డాక్టర్లు చెబుతున్నారు.

హైబీపీకి సంబంధించిన కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్​కు చెందిన డాక్టర్లు నిర్వహించిన పరిశోధనల్లో పలు కీలక అంశాలను గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్న 18 నుండచి 73 సంవత్సరాల వయస్సు గల 280 మందిపై పరిశోధనలు చేశారు.

వీరిని 4 గ్రూఫులుగా విభజించి కోపం, బాధ, ఆందోళన, ఒత్తిడి కలిగించే ఘటనలను గుర్తుకు వచ్చేలా చేశారు. ఒక్కో గ్రూపులోని సభ్యులపై సుమారు 8 నిమిషాల పాటు ఈ పరిశోధన చేయగా బాధ, ఆందోళన, ఒత్తిడి కలిగించే గ్రూపు సభ్యులతో పోల్చితే, కోపానికి గురైన గ్రూపు సభ్యులలో గణనీయమైన మార్పులు సంభవించినట్లు గుర్తించారు.

కోపం వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, శారీరక ఆరోగ్యాంపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. కోపం వల్ల అధిక రక్తపోటు, తలనొప్పి సమస్య సాధారణంగా కనిపిస్తాయని..గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు.

Also Read:హైడ్రాకు చట్టబద్దత..కేబినెట్ కీలక నిర్ణయం

- Advertisement -