నేటి రోజుల్లో రక్తపోటు అనేది చాలమందిలో సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ఏ వయసు వారిలోనైనా కనిపిస్తోంది. ఈ రక్తపోటునే హైపర్ టెంక్షన్ లేదా అధిక రక్తపోటు అని కూడా అంటారు. అధికంగా ఒత్తిడికి లోనవ్వడం, సరైన ఆహారక్రమం లేకపోవడం, చిన్న విషయాలకు కూడా ఫోబియా కు గురవ్వడం వంటి ఎన్నో కారణాలు అధిక రక్తపోటుకు దారి తీస్తాయి. అయితే రక్తపోటు పెరిగితే కొన్ని ప్రమాదకర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధిక రక్తపోటు కారణంగా దమనుల పనితీరు మందగిస్తుంది. .
తద్వారా గుండె కండరాలకు రక్త ప్రవాహం సరిగా జరగడంలో అవాంతరాలు ఏర్పడతాయి. దాంతో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక రక్తపోటు అధికంగా ఉంటే పక్షవాతం కూడా రావోచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉంది. దాంతో పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఇక రక్తపోటు కారణంగా కిడ్నీ సమస్యలు కూడా తలెత్తుతాయి. దృష్టి కోల్పోవడం, నిద్రలేమి వంటి సమస్యలు ఏర్పడడానికి కూడా రక్తపోటు కారణం అవుతుంది. కొందరిలో అధిక రక్తపోటు వల్ల శృంగార సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాగా అధిక రక్తపోటు నివారించడానికి అరటిపండు, బ్లూబెర్రి, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తినాలని నిపుణుల సూచన. అరటిపండులో పొటాషియం, సోడియం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక బ్లూబెర్రిలో ఉండే అంతోసైనిన్స్ వంటి ఫ్లెవనాయిడ్స్ కు కూడా రక్తపోటును తగ్గించే గుణాలు ఉంటాయి. ఆకుకూరాలలో క్యాబేజీ, పాలకూర, లేట్యుస్, కొల్లార్డ్ గ్రీన్ వంటి వాటిలో పొటాషియంతో పాటు మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇక వెల్లుల్లి, టమాటో, డార్క్ చాక్లెట్ వంటివి కూడా రక్తపోటును తగ్గిస్తాయట. అందుకే రక్తపోటుతో బడపడే వాళ్ళు రోజువారి ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read:మైదా పిండి పదార్థాలు తింటే ప్రమాదమే !