బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంతో ఏపీ సర్కార్ అలెర్ట్ అయింది. భారీ వర్షాలపై కలెక్టర్లతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులంతా సిద్ధంగా ఉండాలి.. సహాయక చర్యలకు రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలి.. ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు పెట్టాలి అని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు.
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని…దీని ప్రభావంతో ఒకటి,రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని..అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని… తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు అని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read:OG:ఓజీ ఫస్ట్ డే వసూళ్లు

