Gudivada:గర్ల్స్ హాస్టల్ వాష్‌ రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు

10
- Advertisement -

గుడివాడలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసిన సంఘటన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు సహచర విద్యార్థులు.

వారం రోజుల క్రితమే విషయం బయటకు వచ్చినా యాజమాన్యం స్పందించలేదని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఇప్పటికే 100కి పైగా వీడియోలను అమ్మినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -