ప్రభాస్ ఇప్పుడు బాహుబలి ‘ది కంక్లూజన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదిలో ఈ డార్లింగ్ పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అయితే..ప్రభాస్ మాత్రం ఇప్పుడే ఆ ఆలోచనలో లేడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పేసాడు. ఇదిలా ఉంటే.. ఈ డార్లింగ్ కి ఓ హీరోయిన్ పడిపోయిందట.
అంతేకాదు ఆ బ్యూటీ ప్రభాస్ కి ప్రపోజ్ కూడా చేసిందని సమాచారం. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు. ఈ ద్వారక హీరోయిన్ పూజా ఝవేరీ. ద్వారక లో తన అందాలతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు ప్రభాస్ ని కూడా తన లవ్‌లో పడేసుకునే పనిలో పడింది. తన మనసులో మాటని కూడా బయటకి చెప్పేసిందని టాక్.
అంతకాకుండా ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని ఈ భామ మీడియా ముందు ఓపెన్ అయినట్టు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం బాహుబలి-2లో బిజీగా ఉన్న ప్రభాస్.. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక సుజీత్ దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఓ చిత్రంలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.