ఒకప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్రకథానాయిక అనిపించుకుంది హీరోయిన్ త్రిష. కొన్ని రోజుల పాటు తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో కొన్ని రోజలు బాలీవుడ్ లో తన హవా కొనసాగించింది. అక్కడ కూడా సరైన హిట్ లేకపోవడంతో ప్రస్తుతం అడపతడపా సినిమాలు చేసుకూంటూ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది త్రిష. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.
త్రిష పెళ్లి విషయంలో ఈమధ్య సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే త్రిష పెళ్లి చేసుకోబోంతుందని..అందుకోసమే షాపింగ్ కూడా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా త్రిషకు వరుణ్ అనే వ్యక్తితో నిశ్చితార్ధం జరిగిన తర్వాత కొద్ది రోజులకు కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి రద్దుయిపోయాన విషయం తెలిసిందే. ఇక ఈమధ్య కాలంలో తమిళానాడుకి చెందిన ఓ బిజెనెస్ మేన్ తో త్రిషకి ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించింది త్రిష. కొంతకాలంగా నా పెళ్లిపై వస్తున్న వార్తలు అవాస్తవం అని తేల్చిచెప్పింది. నాకు ఎవరితోనూ ఎంగేజ్ మెంట్ కూడా కాలేదని చెప్పింది. ఇంకా నేను పెళ్లి గురించి ఆలోచన చేయడం లేదని..ఎప్పుడూ చేసుకుంటానో కూడా తెలియదన్నారు. మొత్తం మీద అయితే ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పింది. ఇంతవరకూ తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరకలేదని అందుకే పెళ్లి విషయంపై నేను క్లారిటీ ఇవ్వలేక పోతున్నాని చెప్పింది. నాకూ ఎవరియినా నచ్చితే అతనినే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది.