వామ్మో..సమంత యమ ఫాస్ట్‌..అస్సలు రెస్టే లేదు..!

182
heroine samantha super fast
- Advertisement -

సమంత..టాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌గా దుమ్మురేపుతోంది. ఏ మాయ చేస్తోందోగానీ..సినీ లవర్స్ ని లటుక్కున తన వైపు లాగేసుకుంటోంది ఈ చలాకీ చిన్నది. సామ్‌.. హీరోయిన్‌గా బెస్ట్.. ఫాలోయింగ్‌లో ఎవరెస్ట్..ఇక సోషల్‌ మీడియాలో మాత్రం నో రెస్ట్‌..!. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టే సామ్.. పెళ్లయిన రెండు రోజుల్లోనే ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది.

 heroine samantha super fast

ఇందులో కొత్తేముందీ అనుకుంటే పొరపాటే. తను నెట్టింటికి రావడం పాతే అయినా…మెట్టింటి పేరుతో వచ్చింది. అవును.. పెళ్లి అయిన తర్వాత ఆడపిల్ల ఇంటిపేరు మారడం సహజమే. కానీ సమంత మాత్రం అలా పేరు మార్చుకోవడానికి చాలా ఆత్రుతగా ఎదురుచూసినట్టుంది. అందుకే ఇలా పెళ్లి తంతు పూర్తవ్వగానే, అలా సోషల్ మీడియాలో తన ఇంటిపేరు మార్చేసింది.

అయితే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రమ్ లలో మాత్రం ఇంకా పేరు మారలేదు. నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని కుటుంబంలో భాగమైన సమంత సర్ నేమ్ మార్చేయడంతో ఈ తమిళ పిల్ల శాశ్వతంగా తెలుగు హీరోయిన్‌గా మారనుంది. ప్రస్తుతం సమంత తన పేరును అక్కినేని సమంతగా మార్చుకోవడంతో ఆమె ఫ్యాన్స్‌ ‘అక్కినేని కోడలు’కు స్వాగతం అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.

 heroine samantha super fast

.

- Advertisement -