బుగ్గపై కోరకడం హీరోయిన్‌కి నచ్చలేదట!

52
- Advertisement -

తేజ దర్శకత్వంలో తాను చేసిన ‘జయం’ మూవీలోని ఓ సీన్‌పై హీరోయిన్ సదా ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేసిందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో విలన్‌గా చేసిన గోపిచంద్‌ ఓ సీన్‌లో సదా బుగ్గపై నాలుకతో నాకుతాడు. అయితే ఆ సీన్ చేయనని చెప్పినా, దర్శకుడు తన మాట వినలేదని సన్నిహితుల దగ్గర సదా చెప్పుకొచ్చిందట. ఆ సీన్ పూర్తయ్యాక ఇంటికెళ్లి చాలాసేపు ఏడ్చి.. ముఖాన్ని పదేపదే కడుకున్నానని సదా తెలిపిందట. వేధింపుల పై కూడా సదా చాలా విషయాలు చెప్పింది.

ఓ ప్రముఖ దర్శకుడు పై కూడా సదా షాకింగ్ కామెంట్స్ చేసింది. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న తన సినీ కెరీర్ ట్రాక్ తప్పి.. చివరకు తనకు అవకాశాలు కూడా రాకుండా పోవడానికి కారణం ఆ దర్శకుడే అని సదా చెబుతుంది. అతనికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని.. అతను కోరిక తీర్చకపోతే వారి పై పగ పడతాడు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ దర్శకుడికి బాగా పరిచయాలు ఉన్నాయి. కొందరు స్టార్ హీరోలు కూడా అతనికి ఎక్కువ మర్యాద ఇస్తారు. దాంతో ఆ దర్శకుడు హీరోయిన్ల పై తన పైత్యం చూపించే వాడు అంటూ సదా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read:సినీ ప్రపంచంలో ఆడవాళ్ళకు విలువ లేదా?

అన్నట్టు హీరోయిన్ సదా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమెకు ప్రజా సేవ చేయాలని ఆశ అట. మాజీ సీఎం జయలలిత అంటే ప్రాణం అట. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై సదా స్పందించింది. ‘ఇది అద్భుతమైన ఆలోచన. గౌరవనీయులైన ప్రధాని మోదీ మహిళల అభ్యున్నతి చేస్తున్న కృషి. మహిళలంటే ఆయన ఉన్న గౌరవానికి నిదర్శనమే ఈ బిల్లు’ అని సదా చెప్పుకొచ్చింది. పైగా ఈ రిజర్వేషన్ బిల్లు మహిళలకు సమాన అధికారాలను ఇస్తుంది. ఇది మన దేశానికి పెద్ద అడుగు’ అని సదా చెబుతుంది. మరి తమిళ రాజకీయ తెర పై సదా ఎంతవరకు మెరుస్తోందో లేదో చూడాలి.

Also Read:Harishrao:మహిళా సాధికారతకు నిదర్శనం

- Advertisement -