హీరో కు ప్రపోజ్ చేసిన హీరోయిన్..

258
heroine-love-mrg-hero
- Advertisement -

సాధారణంగా హీరో హీరోయిన్ కు ప్రపోజ్ చేస్తాడు. పెళ్లి చేసుకుందాం అంటాడు. ఇక్కడ సీన్ రివర్స్ ఓ హీరోయిన్ హీరోను ప్రేమిస్తున్నానని చెబుతోంది.. ఇప్పుడు ఈ విషయం ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. గతం లో వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేసారు. తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ టైం లో ఆ హీరోయిన్ ‘ఐ లవ్ యు ‘ అని తన ప్రేమను సదరు హీరోకు తెలియజేసిందట.

heroine-love-mrg-hero

అయితే ఈమె ప్రపోజ్ కు హీరో నుండి ఏ సమాధానం రాలేదని తెలుస్తుంది. ఆ హీరోయిన్‌ మాత్రం రోజూ ఆ హీరోకి మెసేజీలు, ఇమేజీలు పంపిస్తూనే ఉందట. మరోవైపు ఎప్పుడో 30దాటిన ఆ హీరోకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండడంతో కొంతమంది రాజకీయ నేతలు ఆ హీరోను తమ అల్లుడిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఇలాంటి టైం లో సదరు హీరో ఏ నిర్ణయం తీసుకుంటాడో అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -