వైష్ణవ్ తేజ్ మూవీలో లై హీరోయిన్

258
Vaishanv tej, Mega Akash
- Advertisement -

సుప్రిమ్ హీరో సాయి ధరమ్ తేజ తమ్ముడ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఈసినిమా పూజా కార్యక్రమాలను చాలా గ్రాండ్ నిర్వహించారు. ఈవేడుకకు పవన్ కళ్యాణ్ తప్ప మెగా హీరోలందరూ హాజరయ్యారు. సుకుమార్ రైటింగ్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించారు చిత్రయూనిట్.

కొద్ది రోజుల క్రితమే సినిమాలో వైష్ణవ్ తేజ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రంగా ఈసినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా మొదట మనీషా రాజ్ ను తీసుకున్నారు. మనీషా రాజ్ ‘టూ కంట్రీస్’ సినిమా ద్వారా తెలుగు తెరకి ఈ అమ్మాయి పరిచయమైంది. మొదట ఈఅమ్మాయిని వైష్ణవ్ తేజ్ సరసన తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మనీషా రాజ్ ను ఈమూవీ నుంచి తొలగించినట్లు తెలుస్తుంది.

ఆమె స్ధానంలో మేఘా ఆకాశ్ ను తీసుకొవాలని ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. మేఘా ఆకాశ్ నితిన్ సరసన లై, ఛల్ మోహన్ రంగ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేకపోవడం వల్ల మేఘా ఈసినిమాను ఒప్పుకుంటుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. చూడాలి మరి మేఘాకి ఈమూవీతోనైనా హిట్ వస్తుందో లేదో.

- Advertisement -