మ‌రో లేడీ ఓరియెంటెడ్ మూవీలో మ‌హాన‌టి బ్యూటీ..

171
Keerthy Suresh

మహానటితో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ కీర్తి సురేష్‌. ఈ సినిమాలో సావిత్రిగా ఒదిగిపోయింది కీర్తి.తనదైన నటనతో సావిత్రిని మరిపించింది. తాజాగా మరోసారి లేడి ఓరియెంటెడ్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమైంది. కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కే కొత్త చిత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ప్రారంభమైంది.

keerthy

నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నందమూరి కల్యాణ్‌రామ్ క్లాప్ కొట్టగా…హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. కళ్యాణీ మాలిక్‌ సంగీతాన్నిఅందించ‌గా..న‌రేంద్ర అనే కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవ్వ‌నున్నాడు.