అలాంటివి విని ఏడ్చేదాన్ని..!

270
- Advertisement -

టాలీవుడ్,కోలీవుడ్‌లో హీరోయిన్‌ అంజలిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ అమ్మడు తనదైన స్టైల్లో సహజమైన నటనను ప్రదర్శించడం ఆమె ప్రత్యేకత. అంజలి 2006లో ‘ఫొటో’ అనే తెలుగు సినిమాతో నటిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అనేక తమిళ సినిమాల్లో నటించారు. 2011లో దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ నిర్మించిన ‘జర్నీ’ కోసం తొలిసారి జైతో కలిసి పనిచేశారు. ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. ఆమె తెలుగులో నేరుగా నటించిన చిత్రం ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)’. తర్వాత 2017లో వచ్చిన ‘బెలూన్‌’ సినిమాలోనూ జై, అంజలి జోడీగా కనిపించారు. అంజలి, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘పేరంబు’ సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా రాణిస్తోంది.

Heroine Anjali

కానీ అంజలికి తెలుగులో చాలా వరకూ అవకాశాలు తగ్గిపోయాయి. గతంలో ఈ అమ్మడి ప్రేమ వ్యవహారంపై పుకార్లు బాగేనే షికార్లు చేశాయి. తమిళ హీరో ‘జై’తో ప్రేమలో పడిన దగ్గర నుంచే ఆమె కెరియర్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదనే టాక్ వుంది. హీరో ‘జై’ .. అంజలి కలిసి ఒకే ఇంట్లో వుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఒకరి బర్త్ డే కి ఒకరు హడావిడి చేసేశారు. షూటింగ్ సమయంలో వెళ్లి మరీ కేకులు కట్ చేయించారు. త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మద్య దూరం పెరిపోయిందని వార్తలు వచ్చియి. ఈ ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడిన అంజలి.. ‘జై’తో ఆమె ప్రేమ వ్యవహారం గురించి స్పందించింది.. “ఇలాంటి రూమర్స్ ఎలా పుడతాయో .. ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలియదు. కెరియర్ ఆరంభంలో ఇలాంటి పుకార్లకి బాధపడేదాన్ని .. ఏడ్చేదాన్ని కూడా. కానీ ఇప్పుడు అలవాటైపోయాయి. ఎలాంటి పుకార్లయినా కొన్ని రోజులే హల్ చల్ చేస్తాయి .. ఆ తరువాత అంతా మరిచిపోతారు” అంటూ షాక్ ఇచ్చింది.

- Advertisement -