రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఎనిమీ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన చిత్ర బృందం విశాల్,ఆర్య,మిర్నాళిని రవి హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటరు
ఈ సందర్భంగా చిత్ర నటుడు విశాల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని విశాల్ పిలుపునిచ్చారు.సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుందని విశాల్ అన్నారు.తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఈరోజు మొక్క నాటనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో నటుడు ఆర్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగస్వామ్యం అయి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు విదిగా మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి నటుడు ఆర్య ధన్యవాదాలు తెలిపారు.
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా నటి మిర్నాళిని రవి కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం విశాల్,ఆర్య,నటి మిర్నాళిని రవి కి గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.