Vishal: హీరో విశాల్‌కు అస్వస్థత

5
- Advertisement -

హీరో విశాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు – విల్లుపురంలోని ఓవేడుకలో వేదికపై స్పృహతప్పి పడిపోయారు విశాల్. ఒక్కసారిగా వేదికపై కుప్పకూలారు విశాల్‌. విశాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

హీరో విశాల్ ఆదివారం తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన మిస్ విల్లూపురం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కంటెస్ట్‌కు ముఖ్య అతిధిగా వెళ్లారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పొన్ముది కూడా వచ్చారు. విశాల్ స్టేజిపై ఉండగా.. కొంత మంది ట్రాన్స్‌జెండర్లు ఎంతో ఆప్యాయంగా ఆయన్ను పలకరించారు. అయితే అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై స్టేజిపై స్ప్రహ తప్పిపడిపోయారు. ఆయన ఒక్కసారిగా కుప్పకూలటంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

Also Read:ఎండలతో జాగ్రత్త..వడదెబ్బతో నలుగురు మృతి

- Advertisement -