- Advertisement -
ఎంఎస్ ఆనంద్ దర్వశకత్వంలో హీరో విశాల్ నటిస్తూ నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘చక్ర’.విశాల్ సరసన శ్రద్ధాశ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా రోబో శంకర్, కేఆర్ విజయ, సృష్టిడాంగే, మనోబాలా, విజయబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికాగా యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఆన్‌లైన్ వ్యాపారాల్లో మోసాలను ఎండగట్టేలా ఈ చిత్రకథను రూపొందించారు.
సినిమాకు సంబంధించి పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానులని ఆకట్టుకుంటుండగా ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు అనుమతివ్వ గానే షూటింగ్ పూర్తవుతుందని విశాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం టీజర్ తయారు చేస్తున్నామని, త్వరలో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
- Advertisement -