విక్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 17న రిలీజ్ అవుతుంది. ఈసందర్భంగా శనివారం మేకర్స్ ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రాంత్, హీరోయిన్ మెహరీన్, కోలీవుడ్ విలక్షణ నటుడు గురు సోమసుందరం, మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ ‘‘నా మ్యూజిక్ డైరెక్షన్లో ఖుషి తర్వాత ఇక్కడ రిలీజ్ అవుతోన్న రెండో సినిమా స్పార్క్. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ఈ సినిమా కోసం విక్రాంత్‌గారు కొచ్చిన్ వచ్చి నన్ను కలిశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా కోసం ఆయన ఎంత విజన్‌తో పని చేస్తున్నారో నాకు తెలుసు. తను నాకు మంచి సపోర్ట్ ఇచ్చి వర్క్ చేయించుకున్నారు. తనకు ధన్యవాదాలు. తప్పకుండా పాటలను ఆదరించిన స్టైల్లోనే సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
యాక్టర్ గురు సోమసుందరం మాట్లాడుతూ ‘‘నేను తమిళ నటుడ్ని. కానీ మలయాళ చిత్రం మిన్నల్ మురళి కారణంగా అందరూ నన్ను మలయాళీ నటుడు అని అనుకున్నారు. స్పార్క్ మూవీలో విలన్‌గా నటించాను. విక్రాంత్‌గారు కలిసి ఈ మూవీలో నటించటం ఆనందంగా ఉంది. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. యూనిక్‌గా ఉంటుంది. తెలుగు రాకపోయినా నేర్చుకుని మరీ డబ్బింగ్ కూడా చెప్పాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. నవంబర్ 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రాక్ చేస్తుంది’’ అన్నారు.
హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ ‘‘‘స్పార్క్’ మూవీ టైటిల్ తగ్గట్టే స్పార్క్‌లా ఉంటుంది. విక్రాంత్, గురు సోమసుందరం ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించబోతున్నారు. మా నిర్మాత లీలగారికి థాంక్స్. ఆమె మంచి సపోర్ట్‌తో మంచి సినిమాను చేశాం. అది ఇప్పుడు స్క్రీన్‌పై ట్రైలర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. నవంబర్ 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను తప్పకుండా అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
Also Read:పొన్నాలపై రేవంత్ వ్యాఖ్యలు దురదృష్టకరం
హీరో విక్రాంత్ మాట్లాడుతూ ‘‘‘స్పార్క్’ మూవీ నా మూడేళ్ల కల. ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. నేను మూడేళ్ల ముందు యు.ఎస్‌లో ట్రైన్లో వెళుతుండగా ఓ విషయాన్ని చదివాను. ప్రతి మనిషి రెండు సార్లు చనిపోతాడట. ముందుగా కలలు కనటం, వాటిని నేరవేర్చుకోలేకపోతే చనిపోతాడు. మరోసారి భౌతికంగా చనిపోతాడు అని అందులో రాసి ఉంది. అది చదవగానే ఉద్యోగం, సంపాదనలో పడి నేను కలలు కనటాన్ని మరచిపోయానని అనిపించింది. నేను ఒక సినిమా పిచ్చోడ్ని. కాబట్టి.. సినిమా చేయాలని భావించాను. అనుకున్నట్లుగానే ఏడాదిన్నర పాటు కష్టపడి స్పార్క్ మూవీ కథను రాసుకున్నాను. మరో ఏడాదిన్నర పాటు కష్టపడి సినిమాను నిర్మించాం. మూవీ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమా విషయానికి వస్తే ఇదొక మల్టీ జోనర్ మూవీ. ఇందులో యాక్షన్ ఉంది, లవ్ స్టోరి ఉంది. థ్రిల్లర్ సినిమా కూడా. కామెడీ ఉంది, డ్రామా కూడా ఉంది. యూనివర్సల్ అప్పీల్ ఉండటంతో దీన్ని పాన్ ఇండియా రేంజ్లో మల్టీపుల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నాం. నేను హీరోగా నటించాను. తర్వాత మెహరీన్ గురించి చెప్పాలి. ఇప్పటికే చాలా పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు స్పార్క్ మూవీలో మరో విలక్షణమైన పాత్రలో అలరించనుంది. తన పాత్ర పేరు ఇందులో లేఖ. ఆమె కెరీర్లో ఈ పాత్ర గుర్తుండిపోతుంది. రుక్సర్ థిల్లాన్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆమె కూడా విలక్షణమైన పాత్రలో అలరించింది. మిన్నల్ మురళి చిత్రంతో నేషనల్ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన గురు సోమసుందరంగారిని మా సినిమాలో నటించమని అడగ్గానే.. కొత్త నటుడు, దర్శకుడు అయినప్పటికీ పాత్ర నచ్చటంతో మూవీలో యాక్ట్ చేయటానికి అంగీకరించారు. వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మానందంగారు, సుహాసిని, నాజర్, షాయాజీ షిండేగారు ఇలా అందరూ చక్కటి పాత్రల్లో నటించారు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇంకా మూడు సాంగ్స్ రావాల్సి ఉన్నాయి. నవంబర్ 17న రిలీజ్ అవుతున్న సినిమాను చూసిన ప్రేక్షకులు మంచి మూవీ చూశామని ఫీల్ అవుతారు. మూవీ తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటుడు గురు సోమసుందరం ప్రతినాయకుడి పాత్రలో అలరించబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
Also Read:ఆకట్టుకుంటున్న..’మా ఊరి పోలిమేర 2′