డాక్టర్లు కాలు తీసేయాలన్నారు: విక్రమ్

6
- Advertisement -

తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు హీరో విక్రమ్. పుట్టినప్పటి నుంచి ఎన్నో ఒడిదొడుకులు చూశానని తెలిపారు.తన కాలేజీ రోజుల్లో జరిగిన ఓ యాక్సిడెంట్ ను ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రమాదం తర్వాత 4 ఏళ్లు నడవలేదు, డాక్టర్లు నా కాలు తీసేయాలనుకున్నారు అని చెప్పుకొచ్చారు.

నాలుగేళ్లు నడవలేదు, 23 సర్జరీలు చేయించుకున్నా.. వైద్యులు నా కాలును తొలగించాలనుకున్నారు అని చెప్పారు. సినిమా ఛాన్స్ కోసం 10 ఏళ్లు ఎదురుచూశా. నడవలేని స్థితిలో ఉండి సూపర్ స్టార్ ను అవుతానని నా భార్యతో అన్నప్పుడు భ్రమలో ఉన్నాననుకుంది అని చెప్పారు.

పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన తంగాలన్ చిత్రంతో హిట్ కొట్టారు విక్రమ్. దీంతో కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్‌కి పా రంజిత్ అదిరే హిట్ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు విక్రమ్.

Also Read:హైడ్రా కోసం రంగంలోకి సినీ నటులు!

- Advertisement -