హీరో విజయ్‌కి ఐటీ షాక్‌

310
hero vijay
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ విజయ్‌కి చెందిన పలు సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతేకాదు ఈ రోజు విజయ్‌ సినిమా ష్యూటింగ్‌లో ఉండగానే అక్కడే విచారించారు. గత ఏడాది ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో తమిళ హీరో విజయ్ నటించిన చిత్రం ‘బిగిల్’. ఈ సినిమాను రూ.120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని, ఇందుకు సంబంధించిన ఆదాయపు పన్నులను ‘ఏజీఎస్’ లెక్క చూపలేదన్న వార్తల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులకు దిగారు. హీరో విజయ్ ను ఐటీ అధికారులు ప్రశ్నించారు.

vijay-bigil

2019లో విడుదలైన ఈ సినిమాకు సంబంధించి విజయ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఏ రూపంలో తీసుకున్నారు.. వాటిని ఏ రూపంలో విజయ్ ఖర్చు చేశారన్న తదితర అంశాలపై ఐటీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఏజీఎస్ సంస్థ లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. విచారణలో విజయ్ నుంచి సంతృప్తికర సమాచారం రాకుంటే.. ఇంటికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో విజయ్ ఇంటి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

- Advertisement -