స్వయంవరం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో వేణు తొట్టెంపూడి. స్వయంవరం తరువాత చాలా సినిమాల్లో నటించిన వేణు కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంతకాలం వెండితెరకు, సినీ ప్రజలకు దూరంగా ఉన్న వేణు.. సడెన్ గా ఖమ్మం జిల్లాలో కారు పై కనిపించాడు.
ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వేణు బావ టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు తరపుప ప్రచారం నిర్వహిస్తున్నారు. నామా నాగేశ్వరరావు గెలుపు ఖమ్మం అభివృద్ధికి మలుపు అవుతుందన్నారు.
ముదిగొండలో నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు . నామాను గెలిపిస్తే ఐదేళ్లు ప్రజల వెంట ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. ఖమ్మం జిల్లాను అన్ని విధాల అభివృద్ధిలో ఉంచుతారని స్పష్టం చేశారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. వేణు టీఆర్ఎస్‌కి ప్రచారం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.