హీరో వైష్ణవ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభం..

309
Vaishnav Tej
- Advertisement -

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’తో అందరి ప్రశంసలు పొంది.. క్రేజీ హీరోగా మారాడు. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో వైష్ణవ్ తేజ్‌కు కొత్త ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. అయితే వాటిలో ఆయన తనకి నచ్చిన కథలకి మాత్రమే ఓకే చెప్పాడు. ఆ ప్రాజెక్టులలో ఒకటి ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

హీరో వైష్ణవ్ తేజ్ .. హీరోయిన్ కేతిక శర్మపై సాయితేజ్ క్లాప్ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ తల్లి విజయదుర్గ కెమెరా స్విచ్చాన్ చేయగా ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇంతకుముందు ఈ దర్శకుడు తమిళంలో విక్రమ్ తనయుడు ‘ధృవ్’ హీరోగా ‘ఆదిత్య వర్మ’ను తెరకెక్కించాడు. తెలుగులో భారీ విజయాన్ని సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి అది రీమేక్. ఆ సినిమా అక్కడ ఫరవాలేదనిపించుకుంది. ఇక ‘రొమాంటిక్’ .. ‘లక్ష్య’ తరువాత కేతిక శర్మ ఈ సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం వైష్ణవ్‌ తేజ్‌ క్రిష్‌ జాగర్లముడి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -