టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. ఇటివలే అలనాటి అందాల నటి సావిత్రి బయోపిక్ మహానటిగా వచ్చిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా లభించింది. మరికొంత మంది నేతల బయోపిక్ లు కూడా తీయనున్నట్లు సమాచారం. దర్శకుడు తేజ మరో హీరో బయోపిక్ తీయనున్నట్లు ఫిలిం నగర్ లో చర్చ నడుస్తుంది. ఇటివల దగ్గుబాటి రానాతో తీసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయం సాధించడంతో మరో హిట్ సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు తేజ. గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేశాడు తేజ. అయితే ఆ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. షూటింగ్ ప్రారంభంచేస్తామన్న కొ్ద్ది రోజులకే ఆ సినిమా ఆగిపోయింది.
ఆతర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను దర్శకత్వ బాధ్యతలు కూడా తేజకే అప్పగించారు బాలకృష్ణ. సినిమా ప్రారంభోత్సవం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ సినిమాను నుండి కూడా తప్పుకున్నారు తేజ. ఇలా వరుసగా రెండు సినిమాల నుంచి తప్పుకున్న తేజ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ దివంగత హీరో బయోపిక్ తీసే పనిలో ఉన్నాడని సిని వర్గాల్లో టాక్. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ నుండి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ బయోపిక్ రూపకల్పనలో తేజ బిజిగా ఉన్నాడని సమాచారం. చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి..టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఇమేజ్ తెచ్చుకున్న దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ జీవితకథ ఆధారంగా తేజ బయోపిక్ ను తెరకెక్కించబోతున్నట్లు ఫిలిం నగర్ లో చర్చ నడుస్తుంది. ఈసినిమా గురించి తేజ త్వరలోనే ప్రకటన చేయనున్నాడని సమాచారం.