సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, సరికొత్తగా నవదీప్ గా 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్,మౌళి. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు విడుదలైన ద ఏంతమ్ ఆఫ్ లవ్ మౌళి సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రంలో చాలా డిఫరెంట్‌గా నవదీప్ కనిపించడంతో ఈ సినిమా నవదీప్ 2.Oగా అభిమానులంతా ఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ వుంటుందని మంచి అంచనాలతో ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. నేడు విడుదలైన లవ్, మౌళి హీరో టీజర్ చూస్తుంటే.. వీరి అంచనాలను మరింత పెంచే విధంగా వుంది. ఎందుకుంటే ఈ టీజర్‌లో నవదీప్‌ను చూసిన వాళ్లంతా ఈసినిమాతో ఆయన కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్యబోతున్నాడని అంటున్నారు. లవ్, మౌళి హీరో టీజర్ ఆవిష్కరణ కార్యకమం సోమవారం హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ మనం లైఫ్‌లో ఎన్నో చేయలనుకుంటాం. కానీ జరిగేది వేరు. మనం పెట్టే పరుగులో ఆ విషయాన్ని గమనించం, అయితే ఎక్కడో ఒక దగ్గర ఆగి, ఆలోచిస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది. అలా నేను కూడా వేరే వేరే సినిమాలు, అనవసరమైన సినిమాలు చేశాను. లాక్‌డౌన్ లో కొంత విరామం తీసుకుని నా వర్త్ ఏమిటో తెలుసుకున్నాను. ఆ కోవలోనే విన్న కథ ఇది. నా ఆలోచన విధానానికి, నేను చేయాలనుకుంటున్న సినిమాలకు లవ్, మౌళి దగ్గరగా అనిపించింది. అందుకే మీ ముందుకు సరికొత్త చిత్రంతో రాబోతున్నాను అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ నా లైఫ్ లో జరిగిన ప్రేమకథలకు ఫలితమే ఈ సినిమా కథ. నేను పాన్ ఇండియా లెవల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేషన్స్ వున్నాయి. నా స్వీయ అనుభవాలే ఈ సినిమా కథ అన్నారు. కథానాయిక పంఖురి గిద్వానీ మాట్లాడుతూ చాలెంజింగ్‌గా భావించి చేసిన సినిమా ఇది, నా లైఫ్‌లో నేను చేయలేను అనుకున్న సాహసాలు అన్నీ ఈ చిత్రం షూటింగ్ టైమ్ లో చేశాను. ప్రేమ గురించి ఎంతో నిజాయితీగా బ్యూటీఫుల్‌గా చెప్పిన లవ్‌స్టోరీ ఇది. అందరం ఓ ఫ్యామిలీలా కలిసి ఈ చిత్రానికి పనిచేశాం అని తెలిపారు. మ్యూజిక్ దర్శకుడు గోవింద్ వసంత అందించిన ఈ చిత్రంలోని పాటలతో తను లవ్‌లో పడ్డానని, ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించడం ఎంతో గొప్పగా అనిపించందని క్రిష్ణ తెలిపారు. పాటల రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ నవదీప్ నగ్నసత్యంతో మొదలై వర్ణ విస్పోటనంగా మారి సినిమా సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంలో నవదీప్ తనకు తానే కొత్తగా ఆవిష్కరించుకుంటు నవదీప్ 2.0 గా కనిపించబోతున్నాడు అన్నారు. ఈ సమావేశంలో నటి భావన, కళా దర్శకుడు కిరణ్ మామిడి పాల్గొన్నారు.
మెఘాలయలోని చిరపుంజీలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇలాటి వెట్ ప్లేస్ లో షూటింగ్ మొత్తం జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా ఈ చిత్రం నిలిచింది. ఒక వైవిధ్యమైన ప్రేమకథని తెరకెక్కించాలంటే ఆ ప్రేమ కథ జరిగే ప్లేస్ కూడా చాలా ముఖ్యం. దానికి దర్శకుడు విజువల్‌గా ముందుగానే తను తీయబోయో చిత్రాన్ని చూడాలి. ఇండియాలోనే మొట్టమొదటి సారి అత్యంత గరిష్ట మైన తేమ వున్న ప్రదేశంలో ఈ చిత్ర కథని చూపించే ప్రయత్నం దర్శకుడు అవనీంద్ర చేయటం విశేషం గా చెప్పుకొవాలి. దర్శకుడు అవనీంద్ర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను అనకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించాడు అనటానికి ఈ టీజర్ లోని విజువల్స్ నిదర్శనం.
Also Read:హరోం హర…పవర్ ఆఫ్ సుబ్రమణ్యం