మార్చి పోయి సెప్టెంబర్ వచ్చింది: సుశాంత్

157
sushanth

యువ కథానాయకుడు సుశాంత్ హీరోగా తాజాగా ఎస్.దర్శన్ దర్శకత్వంలో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంలో నటించనున్నారు. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రొమాంటిక్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందనుంది.

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడగా తాజాగా అదిరిపోయే లుక్‌తో ఎంట్రీ ఇచ్చారు సుశాంత్‌. మార్చిపోయి సెప్టెంబర్ వచ్చింది గేర్ మార్చి బండి తీయ్ అనే పోస్టర్‌ ఆకట్టుకుంది. ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవి శంకర్ శాస్త్రి, హరీష్ కోయిల గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.