- Advertisement -
హీరో సూర్య బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కురుప్పు సినిమా రానుండగా సూర్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేసింది. నా పేరు సూర్య- నాకు ఇంకోపేరు కూడా ఉంది , ఇది మన టైమ్ అంటూ సూర్య తన వింటేజ్‌లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.
న్యాయాన్ని తక్షణమే అందించే దేవత స్వరూపంగా ఆయనను వర్ణిస్తారు. ఈ వాక్యం వినగానే ప్రేక్షకులకు పాత్రపై ఆసక్తి మొదలవుతుంది. సూర్య ఇందులో రెండు షేడ్స్‌లో కనిపిస్తారని తెలుస్తుంది. ఒకవైపు న్యాయవాదిగా, మరోవైపు నేరస్తులను శిక్షించే వ్యక్తిగా కనిపిస్తారు. టీజర్‌లో సూర్య మాస్ పంచ్ డైలాగులు, అదరగొట్టే లుక్‌తో అభిమానులను ఆబ్బురపరిచారు.
‘కరుప్పు’ అనే పేరు తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ మార్చకుండా అలాగే ఉంచనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
- Advertisement -

