అమ్మాయిల కోసమే డ్రగ్స్‌!

59
drugs
- Advertisement -

డ్రగ్స్‌ వ్యవహారంపై మరోసారి స్పందించారు బాలీవుడ్ హీరో సంజయ్ దత్. ఆ రోజుల్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా సిగ్గు పడేవాడినని… ఎలాగైనా వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నించేవాడినని కానీ ధైర్యం సరిపోలేదన్నారు. డ్రగ్స్ వాడితే ధైర్యం వస్తుందని నమ్మి..వాడటం ప్రారంభించానని చెప్పారు.

అలా డ్రగ్స్‌కు అలవాటయ్యానని తర్వాత డ్రగ్స్ నుంచి బయటపడేందుకు రిహాబిలిటేషన్ సెంటర్ లో గడిపానని చెప్పారు. రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు.

ఒకప్పుడు బాలీవుడ్ అగ్రహీరోగా విలక్షణమైన సినిమాలను తీశారు సంజయ్‌. డ్రగ్స్‌కు బానిసైన తర్వాత వివాదాల్లో నిలవడం,జైలు జీవితాన్ని కూడా గడిపారు. ఇక ఇటవలె కేజీఎఫ్‌ 2లో అధీరా మెప్పించారు సంజయ్.

- Advertisement -