ఏపీలో పొలిటికల్ ఎంట్రీపై నటుడు సుమన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది… ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో నాకు టికెట్ ఇస్తామని కొందరు ఆహ్వానిస్తున్నారు అన్నారు.
నేను పుట్టింది, పెరిగింది తమిళనాడులోనే అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలి అన్నారు. తన తొలి రాజకీయ గురువు చంద్రబాబే అని.. ఆయన్ని చూసే సభల్లో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నానని ఈ సందర్భంగా నటుడు సుమన్ గుర్తుచేసుకున్నారు. విజన్ ఉన్న ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి త్వరితగతిన పూర్తయి అభివృద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు.
47 ఏళ్ల నటనానుభవం ఉన్న సినీ నటుడు సుమన్ 1978లో నీచల్ కులమ్(తమిళ)తో తెరగేంట్రం చేశారు. ఇద్దరు కిలాడీలు చిత్రంతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన సుమన్.. 90వ దశకంలో తిరుగులేని హీరోగా గుర్తింపు సంపాదించారు. నటనలో కొనసాగుతూనే 1999 లో టీడీపీలో చేరిన సుమన్ పార్టీకి మద్ధతుగా పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Also Read:బీసీలను మోసం చేస్తున్న బీజేపీ: కవిత

