క్రైమ్ థ్రిల్లర్ మూవీ..’కోడి బుర్ర’

4
- Advertisement -

హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా “కోడి బుర్ర”. అల్లుకున్న కథ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని వీ4 క్రియేషన్స్ బ్యానర్ లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోడి బుర్ర సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరిస్తున్నారు. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మూవీ టీమ్ చెబుతున్నారు. త్వరలోనే “కోడి బుర్ర” చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా

దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ – ముందుగా ప్రేక్షకులందరికి దసరా శుభాకాంక్షలు. మా “కోడి బుర్ర” అల్లుకున్న కథ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నాం. భారీ క్లైమాక్స్ సన్నివేశాలు రూపొందిస్తున్నాం. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ మూవీకి ఆకర్షణగా నిలవనుంది. హీరో శ్రీరామ్ గారు, మా ప్రొడ్యూసర్స్, ఇతర టీమ్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. సినిమాను మంచి క్వాలిటీతో కంప్లీట్ చేసి త్వరలోనే మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా తీసుకొస్తాం. అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ – తెలుగు ఆడియెన్స్ కు దసరా శుభాకాంక్షలు. “కోడి బుర్ర” సినిమాలో హీరోగా నటిస్తుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం మా మూవీ క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కిస్తున్నారు. చాలా ఫాస్ట్ గా మూవీ షూటింగ్ చేస్తున్నాం. మా మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. కథలో ఎన్నో మలుపులు ఉంటాయి. వాటిని ఇప్పుడే రివీల్ చేస్తే మీకు థ్రిల్ పోతుంది. అందుకే థియేటర్ లోనే “కోడి బుర్ర” సినిమాను చూడండి. ఈ రోజు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వచ్చే మూవీస్ సక్సెస్ అవుతున్నాయి. “కోడి బుర్ర” సినిమా కథ మీ చుట్టూ జరుగుతున్నట్లే ఉంటుంది. చాలా రియలిస్టిక్ మూవీ ఇది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నాకు ఈ మూవీ చేసే ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

హీరోయిన్ ఆరుషి మాట్లాడుతూ – “కోడి బుర్ర” సినిమాలో కీ రోల్ చేస్తున్నాను. మా హీరో శ్రీరామ్ గారు ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెబుతున్నా. “కోడి బుర్ర” అల్లుకున్న కథ ఒక మంచి థ్రిల్లర్ మూవీగా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు

నిర్మాత వట్టం రాఘవేంద్ర మాట్లాడుతూ”వి4 క్రియేషన్ బ్యానర్ లో మేము నలుగురం కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ ఇది. కోడిబుర్ర అనేది మంచి క్యాచి టైటిల్. ఈ చిత్రంలో శ్రీరాం గారు కీరోల్ పోషిస్తుండటం ఆనందంగా ఉంది.అలాగే ఆనంద్ గారు, రాంప్రసాద్, జెమినీ సురేష్ వంటి వారు నటిస్తుండటంసంతోషంగా ఉంది. ప్రస్తుతం మంచి యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నాం. ఈ సినిమాను చాలా రిచ్ గా తెర కెక్కిస్తున్నాం. డెఫినెట్ గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.

Also Read:Harishrao:వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ

నిర్మాత గట్టు విజయ్ మాట్లాడుతూ – “కోడి బుర్ర” సినిమా సెకండ్ షెడ్యూల్ చేస్తున్నాం. మా డైెరెక్టర్ గారి ప్లానింగ్ తో చాలా త్వరగా మూవీ కంప్లీట్ చేస్తున్నాం. ఈ రోజు క్లైమాక్స్ సీన్స్ భారీగా జరుగుతున్నాయి. ఫైటర్స్, స్టంట్ మాస్టర్స్ క్లైమాక్స్ ను అద్భుతంగా రూపొందిస్తున్నారు. మా హీరో శ్రీరామ్ గారికి థ్యాంక్స్. ఆయన ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అన్నారు.

నిర్మాత కంచర్ల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ – “కోడి బుర్ర” సినిమా టీమ్ తరుపున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మా మూవీ సెకండ్ షెడ్యూల్ లో క్లైమాక్స్ భారీ ఎత్తున రూపొందిస్తున్నాం. నా ఫేవరేట్ హీరో శ్రీరామ్ గారితో సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని నా మిత్రులు గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాను. మా సంస్థలో మరిన్ని మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాం. “కోడి బుర్ర” చిత్రాన్ని త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తున్నాం. అన్నారు.

నటుడు ఆనంద్ మాట్లాడుతూ – “కోడి బుర్ర” సినిమాలో ఓ మంచి రోల్ చేస్తున్నాను. థ్రిల్లర్ సినిమాల్లో కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ చేస్తున్నారు డైరెక్టర్ చంద్రశేఖర్ గారు. శ్రీరామ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఒక మంచి చిత్రంతో మీ ముందుకు త్వరలోనే రాబోతున్నాం. అన్నారు.

కమెడియన్ జబర్దస్త్ రాంప్రసాద్ మాట్లాడుతూ – “కోడి బుర్ర” సినిమాలో నేను కామెడీ చేయను. నాతో శ్రీరామ్ గారు కామెడీ చేయిస్తారు. మంచి థ్రిల్లింగ్ ఇచ్చే సినిమా ఉంది. ట్విస్ట్స్, టర్న్స్ ఆకట్టుకుంటాయి. శ్రీరామ్ గారితో ఈ సినిమాలో నటించడం ఎంతో హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ సినిమా మేకింగ్ పట్ల ప్యాషన్ ఉన్నవారు. వారికి “కోడి బుర్ర” అల్లుకున్న కథ చిత్రంతో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

- Advertisement -