రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ప్రారంభించిన హర హై తొహ్ భార హై ఛాలెంజ్‌లో చాలా మంది ప్రముఖులు 3 మొక్కలను నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు హీరో శ్రీకాంత్ వారి ఇంటి ఆవరణలో 3 మొక్కలు నాటి, మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ని చేశారు. హీరోలు నాని, అల్లరి నరేష్,విజయ్ దేవరకొండకి ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ బాగుందని వారికి కృతజ్ఞత తెలిపారు. అలాగే లాస్ట్ ఇయర్ తాను నాటిన మొక్కలకు గాను ఈ రోజు నాకు హర హై తొహ్ భార హై అవార్డ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. నాకు ఫిలింలో వచ్చిన అవర్డ్స్ కంటే ఈ అవార్డ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే గ్రీన్ ఛాలెంజ్ చేస్తేనే మొక్కలు నాటాలని కాకుండా అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన అన్నారు.
Thrilled for honouring me wd “VANAMITRA” thanks to @MPsantoshtrs garu & @cpcybd garu for @IgnitingMindsin #HaraHaiTohBharaHai #GreenindiaChallenge , again planted saplings, now nominating @NameisNani @allarinaresh @TheDeverakonda to to continue the chin 🌱🌴🌳 pic.twitter.com/9yLUKyJTZ6
— SRIKANTH MEKA (@actorsrikanth) September 15, 2019