శానిటైజర్లు పంపిణీ చేసిన హీరో శ్రీకాంత్

284
srikanth
- Advertisement -

కరోనా లాక్‌డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా హీరో శ్రీకాంత్ అతని బ‌ృందం పోలీసులకు మరియు సాధారణ ప్రజలకు ఉచిత భోజనం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా మంగళవారం ఉదయం హీరో శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులకు ఉచిత సానిటైజర్లు, మాస్కులు అందించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ లో పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు హీరో శ్రీకాంత్, శ్రీమిత్ర చౌదరి, నటుడు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -