రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఈరోజు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వతహాగా స్వీకరించి బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన పార్క్ లో రాజ్యసభ సభ్యులు సంతోష్, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ ,ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారితో కలిసి మొక్కలు నాటారు ప్రముఖ హీరో శర్వానంద్.
ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని దీన్ని చూసి నేను ఇన్స్పైర్ అయి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నానని. రోజు రోజుకు మారుతున్న వాతావరణం విధానంలతో మనం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుందని అలాంటి పరిస్థితి రాకూడదు అంటే మనందరం మొక్కలు నాటాలని.వాటిని సన్ రక్షించాలని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా మా ఇంటి పక్కన ఉన్న జిహెచ్ఎంసి పార్కులో యాదాద్రి విధానంలో మొక్కలు పెంచే ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఈ పార్కును నేను దత్తత తీసుకొని ఈ మొక్కలను రక్షించే బాధ్యత తో పాటు దీనిలో అవసరమైన వాకింగ్ ట్రాక్ గాని ; పార్కు అభివృద్ధి కోసం కావలసిన ఏర్పాట్లను నా సొంత డబ్బులతో కావలసిన ఏర్పాటు చేయడానికి ఈ రోజు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అందుకోసం నా ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్ అన్న గారికి మేయర్ బొంతు రాంమ్మోహన్ గారికి ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి కృతజ్ఞతలు.
ఈ సందర్భంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కి అనిల్ సుంకర( AK ఎంటర్ప్రైజెస్) గోపి ఆచంట ;రామ్ ఆచంట (14 రీల్స్) వంశీ; విక్కీ ;ప్రమోద్ (UV క్రియేషన్స్) సుధాకర్ చెరుకూరి (SLV)లన మొక్కలు నాటాలని చాలెంజ్ ఇచ్చారు.
పార్కును దత్తత తీసుకున్న శర్వానంద్ కు అభినందనలు తెలిపిన రాజ్యసభ సభ్యులు సంతోష్ .గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడమే కాకుండా తన ఇంటి పక్కన ఉన్న పార్కు న అభివృద్ధి కోసం దత్తత తీసుకున్న హీరో శర్వానంద్ ను ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ ప్రతినిధి కిషోర్ గౌడ్; జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.