నటుడు శరత్‌కుమార్‌కు తీవ్ర అస్వస్థత..

161
- Advertisement -

సీనియర్ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డయేరియాతో డీహైడ్రేషన్ కు గురైన శరత్‌కుమార్‌ ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

శరత్‌ కుమార్‌కు తీవ్ర అస్వస్థత నేపథ్యంలో ఫ్యాన్స్‌ తీవ్ర ఆందోళనకు గురికాగా ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. 1986లో ‘సమాజంలో స్త్రీ’ అనే సినిమాతో కెరీర్‌ని ప్రారంభించారు.తర్వాత ఏడాదికి పది సినిమాలు చేస్తూ తీరిక లేకుండా బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు.

నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్‌గా పలు విభాగాల్లో పనిచేసి కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు ఈయన 130 సినిమాల్లో పైగా నటించాడు. నిర్మాతగా పదకొండు సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం శరత్ కుమార్ నటించిన వారసుడు రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -