15న అశోక్ గల్లా… “హీరో”

23
hero

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో చిత్రంతో టాలీవుడ్ లో కథానాయకుడిగా అడుగుపెడుతున్నారు అశోక్ గల్లా. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి హీరో చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హీరో సినిమా ఈ నెల 15న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదల కాబోతోంది.

అశోక్‌ గల్లా కు హీరో మొదటి చిత్రమే అయినా ఎంతో మెచ్యూర్డ్ గా నటించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్టింగ్ తో పాటు లుక్స్ తో అశోక్ గల్లా ఆకట్టుకున్నాడు. పవర్ ఫుల్ రోల్‌లో అశోక్‌ గల్లాను హీరో చిత్రంలో చూడబోతున్నామని చెప్పొచ్చు.

ఇక డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య టాలెంటెడ్ డైరెక్టర్. భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఈ కాంబినేషన్ పై అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ‘హీరో’ సినిమా సరికొత్త కథాంశంతో ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. జనవరి 15న తాము ఆశించిన విజయం దక్కుతుందనే పూర్తి నమ్మకంతో ఉంది హీరో మూవీ టీమ్.

నటీనటులు : అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య

సాంకేతిక బృందం

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత : పద్మావతి గల్లా
బ్యానర్ : అమర రాజా మీడియా అండ్ ఎంటర్టన్మెంట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్ర శేఖర్ రావిపాటి
మ్యూజిక్ : జిబ్రాన్
సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ : ఏ రామాంజనేయులు
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
డైలాగ్స్ : కళ్యాణ్ శంకర్, ఏఆర్ ఠాగూర్
కాస్ట్యూమ్ డిజైనర్ : అక్షయ్ త్యాగి, రాజేష్
పీఆర్వో : వంశీ-శేఖర్