రంగంలోకి దిగిన రవితేజ..

375
Disco Raja
- Advertisement -

టాలీవుడ్‌ మాస్‌ మహారాజా రవితేజకి గత కొద్దికాలంగా టైమ్‌ అస్సలు బాగోలేనట్టుంది. ఏ సినిమా చేసినా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంటోంది. రీసెంట్‌గా వచ్చిన ‘అమర్‌అక్బర్‌ఆంటోని’ కూడా తీవ్ర నిరాశను మిగల్చగా.. ప్రస్తుతం ఓ డిఫరెంట్‌ స్టోరీతో రాబోతోన్న ‘డిస్కోరాజా’ షూటింగ్‌ నేడు ప్రారంభమైంది.

Ravi Teja

ఆ మధ్య ఈ సినిమా ఆగిపోయిందని, రెమ్యునరేషన్‌ విషయమై రవితేజ,నిర్మాతల మద్య గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అంతేకాదు స్క్రిప్ట్‌ కూడా సరిగా లేదని దానిలో కొన్ని మార్పులు చేయాలనే విషయంలో సినిమా ఆగిపోనుందనే టాక్ వినిపించింది. అయితే అదే సమయంలో దర్శకుడు వీఐ ఆనంద్‌కి వేరే ఆఫర్ వచ్చిందట. ఇక ఆయన వేరే సినిమా మొదలుపెడితే మరింత ఆలస్యమవుతుందని భావించిన నిర్మాతలు, రవితేజ రంగంలోకి దిగిపోయారు.

ఈ రోజు ‘డిస్కోరాజా’ సినిమాను లాంచ్ చేశారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలకు చోటుండ‌గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. మూడో నాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు. ఈ చిత్రంలో త‌మిళ స్టార్ బాబీ సింహా ప్ర‌తి నాయ‌కుడిగా నటించనున్నారు.

- Advertisement -