హీరో రామ్ న్యూలుక్‌ వైరల్..

231
hero ram
- Advertisement -

టాలీవుడ్‌ హీరో రామ్ పోతినేని కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లుక్‌ త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా కోసమే రామ్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు రామ్‌. ఇపుడు కిషోర్ తిరుమల సినిమా కోసం మరోసారి లుక్ మార్చుకున్నాడు. అయితే తాజాగా ఉన్న ఈ లుక్‌ను త్రివిక్రమ్ సినిమా కోసమే చేసినట్టు రామ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌తో చేయాలనకున్న ప్రాజెక్ట్ మరో ఆరు నెలలు ఆలస్యం కానుంది. ఈ లోపు త్రివిక్రమ్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను రామ్‌తో తెరకెక్కించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లుక్‌లో రామ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ చిత్రంలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైనట్టు, ప్రస్తుతం ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -