సినీ నటుడు రాజశేఖర్‌కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధ రాత్రి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ముందువెళ్తున్నరామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్ కారును రాజశేఖర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మద్యం సేవించి కారునడిపాడని రామిరెడ్డి రాజశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి చనిపోయిన డిప్రెషన్లో రాజశేఖర్ కారు నడపడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, బ్రీత్ అన్‌లైజర్ పరీక్షల్లో మద్యం సేవించలేదని తేలిందని స్థానిక ఎస్ఐ శేఖర్ రెడ్డి సాక్షికి తెలిపారు. చివరకు రాజశేఖర్ కుటుంబ సభ్యులు రాజీకుదర్చడంతో రామిరెడ్డి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా రాజశేఖర్ కారు ప్రమాదం పై ఆయన భార్య జీవిత స్పందించారు. రాత్రి జరిగిన కారు ప్రమాదంలో తన భర్త రాజశేఖర్ కు ఎటువంటి గాయాలు కాలేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీవిత వెల్లడించారు.
గత కొంత కాలంగా రాజశేఖర్ మనసు బాగాలేదని, ఏదో ఆలోచిస్తూ వాహనాన్ని నడిపినందునే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇకపై ఇటువంటి ఘటనలను జరగనీయబోనని, తన భర్త ఒంటరిగా వాహనం నడిపేందుకు అంగీకరించనని తెలిపారు. కేసు సమసిపోయినందున మీడియా కూడా సంయమనంతో వ్యవహరించాలని అన్నారు.