సంక్రాంతి బరిలోకి దిగుతున్న హీరో రాజ’శేఖర్’..!

89
- Advertisement -

టాలీవుడ్ సీనియర్‌ హీరో డా.రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్‌ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. లలిత్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు శివాణి, శివాత్మిక‌, ఎంఎల్‌వీ స‌త్య‌నారాయ‌ణ‌తో క‌లిసి నిర్మిస్తున్నారు. త‌మ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘శేఖర్’ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి నిర్మాతలు తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా విడుద‌ల‌పై మేక‌ర్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా వ‌స్తోంది ‘శేఖ‌ర్‌’ మూవీ. హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంటున్న కొన్ని అనుమానాస్పద యాక్సిడెంటు కేసుల్ని రిటైరైన ఓ పోలీసాఫీసర్ ఎలా పరిష్కరించాడన్నది ఇందులో థ్రిల్లింగ్ గా చూపిస్తున్నారు. ఇది రాజశేఖర్ నటిస్తున్న 91వ చిత్రం కావడం విశేషం.

- Advertisement -