హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించిన పవన్‌..

184
pawan

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు పవర్ స్టార్,జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుండటంతో షూటింగ్ కోసం పవన్ కల్యాణ్ మెట్రోలో ప్రయాణించారు.

మదాపూర్ నుంచి మెట్రోలో మియాపూర్‌కు చేరుకున్నారు. ఇక, కరోనా లాక్‌డౌన్‌కు ముందే వకీల్‌సాబ్ చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్తైంది. అయితే లాక్‌డౌన్ కాలంగా చాలా కాలం పాటు సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా అంజలి,నివేదా థామస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ పింక్‌కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.