యువహీరో నితిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమాలో నటిస్తున్నాడు. రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటివలే విడుదలైన ఈమూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. జనవరిలో ఈమూవీని విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు చిత్రయూనిట్.
తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు హీరో నితిన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్ధ ఈ నిర్మిస్తున్న ఈచిత్రానికి పవర్ పేట అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎప్రిల్ లో ఈమూవీ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలిపారు. ఈ మూవీకి కృష్ణచైతన్య కథ అందించారు. దర్శకుడు ఎవరు అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే నితిన్ ప్రస్తుతం భీష్మతో పాటు వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నటించనున్నాడు. ఈమూవీ పూర్తైన తర్వాత పవర్ పేటలో నటించనున్నాడు. ఇదిలా ఉండగా సమ్మర్ నితిన్ పెళ్లి చేసుకొనున్నాడని వార్తలు వస్తున్నాయి. నితిన్ ఓ తెలుగు అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని వీరిద్దరి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో ఎప్రిల్ లో పెళ్లి చేసుకొనున్నట్లు తెలుస్తుంది.

